Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

గీతలో అద్వైతము

పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణన స్వయం

వ్యాసేన గ్రథితాం పురాణ మునినామధ్యే మహాభారతమ్‌.

అద్వేతామృత వం ిణీం భగవతీ మష్టాదశాధ్యాయినీ

మంబ త్వా మనుసంధథామి భగవద్గీతే భవద్వేషిణీమ్‌.

గీతా ధ్యానశ్లోక మిది. వ్యాసమహం ులవారు వ్రాసిన మహాభారతంలో భగవద్గీత పొందుపరుపబడ్డది. గీతా శాస్త్రాన్ని పైశ్లోకం 'భగవతీ, అద్వైతామృతవం ిణీ' అని బోధిస్తున్నది. గీతను చెప్పినవారు శ్రీకృష్ణభగవానులు. గీతయే భగవతి. గీత నారాయణులవాక్కు. అది అద్వైతామృతవం ిణి అని ధ్యానశ్లోకం చెపుతూంది. అద్వైతతత్త్వమనే అమృతాన్ని వం ించే మేఘమాలిక గీత.

అద్వైతానికి సత్యతకూడ ఒక ఆధారం. ద్రష్ట దృశ్యం అనే రెంటి ఆంతర్యమే ఆసత్యం. పరమాత్మ ఒక్కడే ద్రష్ట, తక్కినదంతా దృశ్యమే. అదేవిధంగా ప్రతివ్యక్తి లోనూ ఒక ద్రష్ట ఉన్నాడు. ఈ ద్రష్టకు తక్కినదంతా దృశ్యమే. దృక్కే జ్ఞానం. జ్ఞానమనగా పరమాత్మయే. అతనికంటే వేరే ద్రష్టలేడు. 'అంతః ద్రష్టా అన్యోన' ప్రతివ్యక్తిలోనూ ఉన్న ఈ ద్రష్ట ఉపాధి కారణంగా బద్ధుడై పరిమితుడై పోతున్నాడు. అంతఃకారణాదులైనఅంతరింద్రియాలూ, నఖశిఖపర్యంతమూ ఉన్న బాహ్యేంద్రియ సమూహమున్నూ ఈ మొదలుగాగల ఉపాధిని మనం, పృథక్కరించిచూస్తే మిగిలేది శుద్ధజ్ఞాన స్వరూపమే.

ఈ వ్యాపారం కూడ అంగవ్రాతముదికాదు. చూచేది ద్రష్ట. దేహం చూస్తున్నదని వ్యావహారికంగా చెప్పుకోడం మామూలు. కాని వ్యాపారం దేహానికి ద్రష్టతోడి సంబంధం వల్లనే వీలవుతున్నదన్నమాట. కాలిన ఇనుము వేడిగా ఉన్నదంటే దానికి కారణం అగ్ని. అగ్ని లేకపోతే లోహం ఎరుపెక్కడముకాని, వెచ్చపడటముకాని సంభవించదు. అదేరీతి ద్రష్ట సంబంధముతోనే దేహం చూస్తున్నది.

ఈ ద్రష్ట శుద్ధజ్ఞాన స్వరూపుడు. అతడు నిష్క్రియుడు. అతనికి ఎట్టి కర్తృత్వమూలేదు. అనగా జ్ఞానానికి ఎట్టి కర్తృత్వమూలేదు. ఏదైనా పని జరగవలెనంటే అవయవములు ఉండాలి. ఈ ద్రష్ట శుద్ధజ్ఞాన స్వరూనుడూ, నిరవయవుడూ. అందుచే అతడు కర్త, భోక్తకాడు. అతడు చేయగలవాడు కాని, అనుభవించగలవాడుకాని కాడు. అద్వైతంలో చెప్పబడిన ఈ ద్రష్ట సాంఖ్యసిద్ధాంతంలోని పురుషుని వంటివాడు. కాని సాంఖ్యం పురుషునికి భోక్తృత్వం అంటగటుతూంది. అద్వైతంలో కర్తృత్వ, భోక్తృత్వాలు రెండూలేవు. పైగా గీత ఆత్మను ఎవడైతే కర్తగా తలుస్తున్నాడో వాడు దుర్మతి అని చెప్పుతున్నది.

పరమాత్మకెట్లు కర్తృత్వ, భోక్తృత్వాలు లేవో అట్లే జీవాత్మకున్నూ లేవు. ఆత్మకు కార్యమూ లేదు, అనుభవమూ లేదు. 'నకరోతినలిప్యతే' 'ఆత్మ చేస్తున్నది' అని ఎప్పడన్నా అంటే అది వ్యావహారికమే. 'కుర్వన్నపి న లిప్యతే' అనగా 'న కర్మఫలలేపః' - కర్మఫలాన్ని అది అనుభవించడం లేదని అర్థం. ఏదైనా కార్యం చేస్తున్నదంటే అది ఆత్మకాదు. మొదటినుండి చివరివరకూ ఆత్మ చిత్స్వరూపమనీ, దానికి కర్తృత్వం లేదనీ గీత పలుమారులు బోధిస్తున్నది. కార్యమెప్పుడైతేలేకపోయిందో, ఫలరూపమైన సుఖదుఃఖాలున్నూ ఆత్మకు లేకపోయినవి. 'ఆత్మ కర్త కాదు. భోక్తకాదు' అని మాటి మాటికీ గీత బోధించడం చేత అది అద్వైతామృతవం ిణిఐనది.

భగవానుడు గీతలోనే మరొకచోట అంటున్నాడు.

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత !

ఒక్క పరమాత్మయే, ఒక్క చిత్స్యరూపమే ఉపాధిచేత నానావిధజీవరాసులుగా కన్పడుతున్నాడు. విద్యుద్దీపాలు ఎన్నో వెలుగుతున్నా, వీని అన్నింటిలోనూ ఉన్న విద్యుచ్ఛక్తి ఒక్కటే. క్షేత్రములు అనేకములు. క్షేత్రజ్ఞుడు ఒక్కడు. ఆచిత్తు పూర్ణం. అనంతం, ఏకం. అంతటా నిండినవస్తువు ఉపాధిబద్ధం కావడంవల్ల ద్వైతం అవుతూంది. ఉపాధి భగ్నమైనప్పుడు అది ఏకమై అద్వైతం అవుతూంది. నిరుపాధికమైన చిత్తువలనే ఉపాధిలోని చిత్తున్నూ ద్రష్టయే. ఆకాశంలోని చంద్రుడు తటాకంలో ప్రతిబింబిస్తూ ఉంటాడు. చంద్రునికెంత ప్రకాశమో ప్రతిబింబచంద్రునికీ అంతే ప్రకాశం ఉన్నది.

ఆచార్యులను, బంధువులను, స్నేహితులనూ యుద్ధంలో చంపవలసి వచ్చినదే అని అర్జునుడు శోకిస్తాడు. యుద్ధంనుండి వైతొలగాలని కోరుకుంటాడు. అంతటితో అగక యుద్ధమే ఒక పాపకార్యమని వాదిస్తాడు. యుద్ధం కులక్షయానికి హేతువనీ, కులక్షయంవల్ల ధర్మనాశనమూ, వర్ణసంకరమూ కలుగుతుందనీ కృష్ణభగవాన్లుకు విన్నవిస్తాడు. కులములోని పెద్దలు అంతరిస్తే ధర్మము నాశనమవుతుంది. ధర్మక్షణకూ, ధర్మబోధకూ పెద్దలుకదా అవసరం. వారు లేకపోతే మార్గదర్శకు లెవరు? పెద్దలందరూ యుద్ధంలో హతులైపోతే శేషించిన పిన్న వాండ్రందరూ త్రోవతెలియకుండా అనుభవజ్ఞానం లేక ఇంద్రియచాపల్యానికి లోబడి ఇచ్చవచ్చిన రీతిని మెలగుతూ కులక్షయానికి కారకులవుతాకు. స్త్రీలను పోషించేవారు లేకపోవడంవల్ల వర్ణసాంకర్యం కలుగవచ్చు. వర్ణసంకరత కలిగేసరికి వర్ణాశ్రమ ధర్మాలకు లోపం కలుగవచ్చు అని అర్జునుడు విన్నవిస్తాడు.

ఎంతో యుక్తితో కూడిన ఈవాదానికి కృష్ణపరమాత్మ 'యుద్ధంచేస్తేకాదు వర్ణసంకరం అవడం, యుద్ధం చేయకపోతేనే వర్ణసంకరమూ, ధర్మసంకరమూ కలుగుతుంది' అని బదులు చెప్పినారు. ఎవడిమట్టుకువాడు తన సంగతి తాను ఆలోచించుకొనిచూడాలి. నేను నాధర్మాన్ని పాటించకపోతే నాకర్తవ్యాన్ని నెరవేర్చకపోతే లోకమంతా నన్నే అనువర్తిస్తుంది. అప్పుడు ఆ వర్ణసంకరానికి నేను కారకుణ్ణి ఆవుతాను.

యది హ్యయం న వర్తేయం జాతు కర్మ ణ్యతన్ద్రితః,

మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః

ఉత్సీ దేయు రిమే తోకా న కుర్యాం కర్మ చేదహమ్‌,

సంకరస్య చ కర్తాస్యా ముపహన్యా మిమాః ప్రజాః.

తన తన ధర్మాన్ని తాను పాటించకపోతే వర్ణసంకర మేర్పడుతుంది.

అర్జునుడు క్షత్రియుడు కనుక క్షత్రియుడు ధర్మయుద్ధం చేయవలె. అతడు తన ధర్మాన్ని నిర్వర్తించకపోతే ధర్మ సంకరమూ, వర్ణసంకరమూ ఏర్పడుతుంది.

గీత అర్జునవిషాదంతో ప్రారంభమవుతుంది. 'అశోచ్యా నన్వశోచస్త్వం' అని భగవానులు ఉపదేశం ప్రారంభిస్తారు. 'మాశుచః' అని పరిపూర్తి చేస్తారు. గీత స్మృతియని అంటారు. స్మృతికి శ్రుతి ఆధారంగా ఉండాలి. గీతాసందర్భము లాంటిదే ఛాందోగ్యంలో నారద సనత్కుమారులకు జరిగిన సంభాషణలో వస్తుంది. వారదులు సనత్కుమారులను సంబోధిస్తూ మహాత్మా! నేను దుఃఖాక్రాంతుడనై యున్నాను. ఆత్మనెరిగినవాడు దుఃఖాన్ని తరిస్తాడని నేను విన్నందువల్ల నన్ను ఈ దుఃఖాంబుధిలో నుంచి ఆవలిగట్టుకు పడవేయండి' అని ప్రార్థిస్తాడు.

గీతలోనూ భగవానుడు :

'గతాసూ నగతాసూం శ్చ నాను శోచన్తి పండితాః'

జ్ఞానులు, ఆత్మవిదులు, గతించిన వారికోసంగాని, బ్రతికిన వారికోసంగాని దుఃఖించరు. అని ప్రారంభించి శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఆత్మజ్ఞానం బోధించడానికి ఉపక్రమించాడు.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page